- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తక్కువ ధరలో లభిస్తున్న Realme 12 సిరీస్
దిశ, టెక్నాలజీ: రియల్‌మీ కంపెనీ ఇండియాలో కొత్తగా 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను బుధవారం విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ప్రధానంగా Realme 12+ 5G, Realme 12 5G మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా రియల్‌మీ UI 5.0 స్కిన్‌తో పాటు ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతాయి, అలాగే కెమెరాల కోసం ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉన్నాయి. బడ్జెట్ ధరలో హై ఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్లు లభిస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్లకు మూడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, రెండేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తున్నారు.
Realme 12 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.16,999. 8GB RAM + 128GB ధర రూ.17,999. ఇది ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. Realme 12+ 5G మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.20,999. 8GB RAM+ 256GB ధర రూ.21,999. ఈ మోడల్ నావిగేటర్ లేత గోధుమరంగు, పయనీర్ గ్రీన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తక్కువ ధర కూడా లభిస్తుంది.
Realme 12 5G స్పెసిఫికేషన్స్: ఫోన్ 6.72-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. 6nm MediaTek డైమెన్సిటీ 6100+ 5G SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. కెమెరాల కోసం బ్యాక్ సైడ్ 108MP+2MP+2MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది. ఇది స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంటుంది. దీనిలో 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.
Realme 12+ 5G స్పెసిఫికేషన్స్: ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. డిస్‌ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వచ్చింది. MediaTek డైమెన్సిటీ 7050 5G SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఫోన్‌ను వర్షంలో వాడిన లేదా తడి చేతులతో ఆపరేటింగ్ చేసిన సాధారణంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంటుంది. దీని కోసం ఫోన్‌లో ప్రత్యేకంగా రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను అమర్చారు. ఫోన్ బ్యాక్‌సైడ్ 50MP Sony LYT-600 ప్రైమరీ+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లేలో ఉంటుంది. దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది.