Minister Nadendla Manohar:కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

by Jakkula Mamatha |
Minister Nadendla Manohar:కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు.. ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు.. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. నేడు(బుధవారం) కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారితో కలిసి మంత్రి నాదెండ్ల క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.

రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యల పై రైతులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటూ ఇటూగా ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం లోపు రైతులు సిద్ధం చేసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని దిశానిర్దేశం చేశారు. చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసా నగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed