Flipkart : ఫ్లిప్ కార్ట్‌లో రాఖీ పండుగ డిస్కౌంట్స్.. అతి తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్!

by Jakkula Samataha |
Flipkart : ఫ్లిప్ కార్ట్‌లో రాఖీ పండుగ డిస్కౌంట్స్.. అతి తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్!
X

దిశ, ఫీచర్స్ : ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ అందించింది. ఫ్లిప్ కార్ట్ పండుగ సందర్భంగా కొన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ ప్రకటించి, అతి తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో రాఖీ రాబోతుంది. అన్నయ్యలు తమ అక్కాచెల్లెళ్లకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ పోన్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

కాగా, ఫ్లిఫ్ కార్ట్ రాఖీ సేల్‌లో భాగంగా, vivo k12x 5G స్మార్ట్ ఫోన్ రూ.18,999 ఉండగా,స్పెషల్ ఆఫర్ కింద 15 శాతం డిస్కౌంట్‌కు లభిస్తుంది. అంటే దీనిని మీరు రూ.12,999కే పొందవచ్చు. అలాగే,hdfc బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ పేమెంట్ చేస్తే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్సేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీంతో దాదాపు రూ.4000 వరకు తగ్గించుకోవచ్చు. ఇలా మొత్తం ఆఫర్ పోగా, vivo k12x 5G స్మార్ట్ ఫోన్ రూ.6000కే కొనుగోలు చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా, ఈ ఫోన్‌ను కొనుగోలు చేయండి.

Advertisement

Next Story