- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
129 వసంతాలు పూర్తి చేసుకున్న రేడియో మామ..
దిశ, ఫీచర్స్ : రేడియో గురించి తెలియని వారు ఉండరు. ఇది ప్రపంచం మొత్తానికి సమాచారాన్ని, వినోదాన్ని, విద్యను సులభంగా అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13ని ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 13న రేడియో దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అయితే ఇప్పుడున్న యువతలో చాలామందికి రేడియోల ప్రాముఖ్యత గురించి తెలియదు. ఇప్పుడు మనం ఆ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
రేడియో చరిత్ర విషయానికొస్తే ఇటలీకి చెందిన గుగ్లియెల్మో మార్కోని 19వ శతాబ్దం చివరిలో 1895లో మొదటి రేడియో ప్రసారాన్ని ప్రారంభించారు. సంగీతం, కమ్యూనికేషన్ కోసం రేడియో ప్రసారం 1905-1906లో ఒక ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.
1920ల ప్రారంభంలో రేడియో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది. మూడు దశాబ్దాల తర్వాత రేడియో స్టేషన్లు ఉద్భవించాయి. 1950ల నాటికి, రేడియో ప్రసార వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి. ఆలోచనల మార్పిడిలో ఇది పెద్ద పాత్ర పోషించింది.
రేడియో అనేది పురాతనమైన, అత్యంత శక్తివంతమైన మాస్ కమ్యూనికేషన్ మాధ్యమాలలో ఒకటి. ఇంటర్నెట్ యాక్సెస్ లేని లేదా ఇతర కారణాల వల్ల డిస్‌కనెక్ట్ అయిన వారిని చేరుకోవడానికి ఇది సమర్థవంతమైన పరికరం. వార్తలు, ప్రస్తుత సమస్యలను అందరికీ షేర్ చేసేందుకు రేడియో సహాయపడుతుంది.
రేడియోలు ప్రారంభం అయిన మొదట్లో ఓడలలో ఉపయోగించేవారు. 1912లో టైటానిక్ తన మొదటి ప్రయాణానికి బయలుదేరినప్పుడు, మార్కోని వద్ద వైర్‌లెస్ పరికరం ఉంది. టైటానిక్ మునిగినప్పుడు, ఈ పరికరం ద్వారా సహాయం కోసం సందేశం పంపించారు, అప్పుడే ప్రజల ప్రాణాలు కూడా రక్షించారు.