- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే గేమింగ్ అనుభవం కోసం Ptron నుంచి కొత్త ఇయర్‌బడ్‌లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కంపెనీ Ptron కొత్తగా ఇయర్‌బడ్‌లను విడుదల చేసింది. దీని పేరు 'Ptron Basspods Flare'. కొత్త వైర్‌లెస్ (TWS) ఇయర్‌బడ్‌ల ధర రూ. 899. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి అందుబాటులో ఉన్నాయి. బ్లాక్, బ్లూ, పసుపు కలర్స్‌లో లభిస్తున్నాయి. గేమింగ్ ఆడేవారికి సరికొత్త బేస్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికోసం 40ms అల్ట్రా- తక్కువ లేటున్సీ AptSense టెక్నాలజీని కూడా కలిగి ఉన్నాయి. ఇవి మల్టీ-ఫంక్షన్ టచ్ కంట్రోల్ ద్వారా పనిచేస్తాయి.
ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. ప్రతి ఇయర్‌బడ్‌లో 13mm డైనమిక్ డ్రైవర్‌లను అమర్చారు. Google అసిస్టెంట్ లేదా Siri కోసం AI వాయిస్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తాయి. చెమట లేదా స్ప్లాష్ రెసిస్టెంట్ కోసం IPX4 రేటింగ్ చేయబడింది. ఇవి చార్జింగ్ కేస్‌తో, ఒక చార్జ్‌పై గరిష్టంగా 35 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. USB టైప్-C ద్వారా ఇయర్‌బడ్‌లను చార్జ్ చేయవచ్చు. ఇవి RGB లైట్‌లతో ప్రత్యేకమైన, సూపర్-హీరో-ప్రేరేపిత డిజైన్‌తో వస్తున్నాయి.