15 సెకన్ల రికార్డింగ్‌తో వాయిస్‌ను క్లోన్ చేసే OpenAI కొత్త ఆవిష్కరణ

by Harish |
15 సెకన్ల రికార్డింగ్‌తో వాయిస్‌ను క్లోన్ చేసే OpenAI కొత్త ఆవిష్కరణ
X

దిశ, టెక్నాలజీ: కృత్రిమ మేధ ప్రపంచంలో సంచలనం సృష్టించిన OpenAI నుంచి మరో సరికొత్త ఆవిష్కరణ వచ్చింది. వ్యక్తుల వాయిస్‌ను క్లోనింగ్ చేసే AI టూల్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఒక వ్యక్తి మాట్లాడే వాయిస్‌ను రికార్డ్ చేసుకుని అచ్చం అతనిలా మాట్లాడుతుంది. అది కూడా కేవలం 15 సెకన్ల వాయిస్ రికార్డ్ ద్వారా వ్యక్తి వాయిస్‌ను తిరిగి వినిపిస్తుంది. వాయిస్ ఇంజిన్‌గా పిలువబడుతున్న ఇది సాధారణ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఈ కొత్త ఫీచర్‌ను దుర్వినియోగ పరిచే అవకాశం ఉంది. వాయిస్ క్లోనింగ్‌కు సంబంధించి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి.

వ్యక్తుల వాయిస్‌లను క్లోనింగ్ చేయడం వలన చాలా సమస్యలు వస్తాయి, ముఖ్యంగా ఎన్నికల వంటి సున్నితమైన సందర్భాలలో నాయకుల మాటలను క్లోనింగ్ చేసి తప్పుగా వినిపించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, ఈ నేపథ్యంలో దీనిని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకు రాకుడదని నిర్ణయించుకునట్లు OpenAI సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ఇటీవల కాలంలో బైడెన్ వాయిస్‌ను కృత్రిమ మేధ ద్వారా క్లోనింగ్ చేశారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు వాయిస్-క్లోనింగ్‌ను అందిస్తున్నప్పటికీ అవి ఎంపిక చేసిన వ్యాపారులకు మాత్రమే యాక్సెస్ ఇస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed