OnePlus నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

by Harish |
OnePlus నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ OnePlus త్వరలో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే 2023 జులై-సెప్టంబర్ మధ్య కాలంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే మిగతా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ రకమైన ఫోన్‌లను వరుసగా లాంచ్ చేస్తున్నాయి. ఈ కంపెనీలకు పోటీని ఇవ్వడానికి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను OnePlus తీసుకురానుంది. వన్‌ప్లస్ తన క్లౌడ్ 11 ఈవెంట్‌లో భాగంగా ఫోల్డబుల్ ఫోన్ గురించిన విడుదల ప్రక్రియను అధికారికంగా ప్రకటించింది.


గత కొంత కాలంగా OnePlus కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుందని ఊహగానాలు వచ్చాయి. కానీ కంపెనీ వాటిని ధృవీకరించలేదు. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో అధికారికంగా కంపెనీ ప్రకటించడంతో ఇప్పటికే మిగతా ఫోన్లలో అగ్రస్థానంలో ఉన్న OnePlus, వినియోగదారులను ఆకట్టుకోడానికి సరికొత్తగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ఏడాదిలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌‌ను వినియోగదారులకు పరిచయం చేయనుంది.



Advertisement

Next Story