Instagramలో కొత్త ఫీచర్స్.. ఎడిటింగ్ టూల్స్, నచ్చిన వారికే పోస్ట్‌లు కనిపించేలా ఆప్షన్

by Harish |   ( Updated:2023-11-17 16:27:08.0  )
Instagramలో కొత్త ఫీచర్స్.. ఎడిటింగ్ టూల్స్, నచ్చిన వారికే పోస్ట్‌లు కనిపించేలా ఆప్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: మెటా ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు, రీల్స్, వీడియోలను తమకు నచ్చిన వారు మాత్రమే చూసేలా కొత్త ఆప్షన్‌ను కంపెనీ తెచ్చింది. గతంలో ఈ ఫీచర్ స్టోరీస్‌కు మాత్రమే ఉండగా దీనిని మిగతా వాటికి కూడా విస్తరించారు.

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే వాటిని అందరూ చూడవచ్చు. అదే ప్రైవసీ అకౌంట్‌కు మాత్రం వారి ఫాలోవర్స్‌ మాత్రమే చూడవచ్చు. అయితే ఇకమీదట ఫాలోవర్స్‌ అని కాకుండా నచ్చిన వారు మాత్రమే పోస్టులు చూసేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, లేదా స్టోరీస్‌లు పోస్ట్ చేస్తున్న సమయంలో ‘ఫాలోవర్స్’ లేదా ‘క్లోజ్ ఫ్రెండ్స్’ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. దానిలో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు.

దీంతో పాటు ఫీడ్‌ను నచ్చిన విధంగా ఎడిట్ చేసే ఫీచర్ అందించారు. క్రాప్, రొటెట్ వంటి కొత్త టూల్స్‌ను యాడ్ చేశారు. ఇంకా 10 కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్-టు-స్పీచ్ వాయిస్‌లు, ఆరు కొత్త టెక్స్ట్ ఫాంట్‌లను కూడా తెచ్చారు. ఫొటోలు, వీడియోలతో స్టిక్కర్లను క్రియేట్ చేసుకునే ఫీచర్‌ను కూడా విడుదల చేశారు.

Advertisement

Next Story