ట్రూ కాలర్‌లో సరికొత్త ఫీచర్.. మోసపూరిత కాల్స్‌ను ఇలా గుర్తించడి!

by Jakkula Samataha |
ట్రూ కాలర్‌లో సరికొత్త ఫీచర్.. మోసపూరిత కాల్స్‌ను ఇలా గుర్తించడి!
X

దిశ, ఫీచర్స్ : ట్రూకాలర్ అనేది చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫేక్ కాల్స్ గుర్తించడానికి అంతే కాకుండా కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే వారి పేరు తెలుసుకోవడానికి ఈ ట్రూకాలర్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది ఈ యాప్ వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అంతే కాకుండా స్పామ్ కాల్స్ గురించి కూడా తెలుసుకోవడం ఈ ట్రూకాలర్ ద్వారా చాలా ఈజీ అయిపోయింది. అయితే రోజు రోజుకు సైబర్ క్రైమ్ అనేది పెరుగుతుంది. మెసేజెస్, కాల్స్ చేస్తూ కొత్త కొత్త మోసాలకు తెర దించి డబ్బులు కాజేస్తున్నారు. దీంతో అసలు అది ఫేక్ కాల్‌నా లేక మనవారే ఎవరో కాల్ చేశారా అనేది కూడా తెలియక చాలామంది మోసపోయి, డబ్బులు పొగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ట్రూకాలర్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ఏమిటంటే? ఏఐ మోడల్. దీని ద్వారా మీరు ఫేక్ కాల్స్‌ని ఐడెంటిఫై చేయోచ్చు. మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఏఐ డిటెక్షన్ మీద క్లిక్ చేయగానే మీకు అది క్షణంలో రిజల్ట్ ఇస్తుంది. దీంతో మీరు మోసపూరిత కాల్స్ పట్ల అలర్ట్‌గా ఉండొచ్చు. ఇక దీని కోసం మీరు ట్రూకాలర్ యాప్‌ను డిఫాల్ట్ యాప్‌గా సెట్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్స్ అందరికీ అందుబాటులో లేదు. అమెరికాలో మాత్రమే ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. త్వరలోనే అందరకీ అందుబాటులోకి రాబోతుందంట.

Advertisement

Next Story

Most Viewed