Motorola నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

by Harish |
Motorola నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Motorola నుంచి త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. దీని పేరు Motorola Razr. ఇది 2000 సంవత్సరంలో బాగా పాపులర్ అయిన ఫోన్. ప్రస్తుతం దీని కొత్త వెర్షన్‌ను ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ ప్రకటించారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన Razr‌ కు మంచి ఆదరణ ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ కొత్త వెర్షన్‌ను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. నివేదికల ప్రకారం ఫోన్ ఫీచర్లు వినియోగదారులకు నచ్చే విధంగా ఉండనున్నాయి. లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్లు త్వరలో వెల్లడించనున్నారు.



Advertisement

Next Story