3D కర్వ్డ్ డిస్‌ప్లే‌తో ‘Motorola Edge 40 5G’ స్మార్ట్ ఫోన్

by Harish |
3D కర్వ్డ్ డిస్‌ప్లే‌తో ‘Motorola Edge 40 5G’ స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Motorola కంపెనీ నుంచి కొత్త మోడల్ ‘Edge 40 5G’ స్మార్ట్ ఫోన్ ఈ నెల చివరలో ఇండియాలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారత మార్కెట్లో త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 6.55-అంగుళాల పూర్తి-HD+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.



ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8020 SoC ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌‌తో రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్‌సైడ్ 50MP+ 13MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. 68W TurboPower వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్,15W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ. 50,000 వరకు ఉండే అవకాశం ఉంది.




Advertisement

Next Story