‘Moto G84 5G’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఆఫర్‌లో రూ.1000 తగ్గింపు..

by Harish |   ( Updated:2023-09-01 08:39:36.0  )
‘Moto G84 5G’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఆఫర్‌లో రూ.1000 తగ్గింపు..
X

దిశ, వెబ్‌డెస్క్: Moto కంపెనీ నుంచి కొత్తగా ‘Moto G84 5G’ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో శుక్రవారం విడుదలైంది. ఇది ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ అయింది. 12GB RAM+ 256GB వేరియంట్ ధర రూ. 19,999. ఇది మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు.

Moto G84 5G ఫీచర్స్

* 6.55-అంగుళాల పూర్తి-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) pOLED డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్‌, 1300 nits గరిష్ట బ్రైట్‌నెస్

* ఆక్టా కోర్ Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసర్

* ఆండ్రాయిడ్ 13 తో రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 50 MP+ 8MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* ఇది 33W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

* దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌తో వస్తుంది.

* ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇన్-డిస్‌ప్లే‌లో అమర్చారు.

Advertisement

Next Story