- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో మొట్టమొదటి డ్రైవర్ లెస్ వెహికల్.. పూర్తి వీడియో ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డ్రైవర్ లెస్/మానవ రహిత వాహనాలను చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్నింటిని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ప్రముఖ కంపెనీ టెస్లా కూడా ఇటీవల డ్రైవర్ లేకుండా నడిచే భారీ ట్రక్కును రోడ్డు మీద నడిపి పరీక్షించింది. భారత్‌లో కూడా వీటికి డిమాండ్ అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా దేశీయ కంపెనీలు పోటీ పడి మరి డ్రైవర్ లెస్ కార్లను తయారు చేస్తున్నాయి.
అయితే బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్, మైనస్ జీరో కంపెనీ తాజాగా డ్రైవర్ లెస్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని పేరు ‘zPod’. ఈ ఎలక్ట్రికల్ డ్రైవర్ లెస్ వెహికల్‌లో నలుగురు ప్రయాణించవచ్చు. ఇది పూర్తిగా విద్యుత్తుతో నడిచేది. డ్రైవింగ్ అంతా AI ద్వారా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాహనంలో అమర్చిన కెమెరాల సహయంతో ట్రాఫిక్ పరిస్థితులను విశ్లేషించడం, వేగాన్ని నియంత్రించడం, అడ్డంకులను తప్పించడం లేదా వాహనాన్ని ఆపడం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఇటీవల విడుదల చేసింది