Bing AI చాట్ లిమిట్‌ను పెంచిన మైక్రోసాఫ్ట్

by Harish |
Bing AI చాట్ లిమిట్‌ను పెంచిన మైక్రోసాఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కొత్తగా వినియోగదారుల కోసం అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ ఆధారిత Bing AI చాట్ లిమిట్‌ను కంపెనీ పెంచింది. బింగ్ ఏఐ చాట్ లిమిట్‌ను రోజుకు మొత్తం 60 చాట్‌ కన్వర్షన్లకు పెంచినట్లు ప్రకటించింది. గతంలో ఇది రోజుకు మొత్తం 50గా ఉండేది. అలాగే త్వరలో ఈ లిమిట్‌ను 100 కు పెంచాలని టెక్ దిగ్గజం చూస్తోంది. వినియోగదారులు చాట్ లిమిట్ పట్ల ఇబ్బందిగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయోజనాల కోసం ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదుపాయం ద్వారా ఇక మీదట వినియోగదారులు సుదీర్ఘమైన చాట్‌లు చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed