ప్రాణాలు కాపాడిన మెటా ఏఐ

by M.Rajitha |
ప్రాణాలు కాపాడిన మెటా ఏఐ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం నడుస్తున్న సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో ఎనలేని సేవలు అందిస్తోంది. కేవలం ఇది అనేక రంగాల్లోనే కాదు.. ఓ మనిషి ప్రాణాన్ని కాపాడింది. ఏంటి మనిషి ప్రాణాన్ని ఏఐ కాపాడిందా అనుకుంటున్నారా.. అవును నిజమే. వివరాల్లోకి వెళితే.. యూపీలోని లక్నో పట్టణానికి సమీపంలోని గ్రామంలో ఓ యువతీ యువకుడు ప్రేమించుకొని ఎవ్వరికీ తెలియకుండా రహాస్యంగా వివాహం చేసుకున్నారు. కాని వీరి వివాహాన్ని ఆ గ్రామస్తులు ఒప్పుకోక పోవడంతో ఆ యువకుడు ఆమెను వదిలేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి తాను చనిపోతున్నట్టు ఓ వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొద్ది నిముషాల్లోనే ఆ వీడియో వైరల్ అవడంతో, మెటా ఏఐ డీజీపీ కార్యాలయానికి అలర్ట్స్ జారీ చేసింది. హుటాహుటిన ఆ యువతి ఉన్న ప్రదేశాన్ని ట్రేజ్ చేసిన పోలీసులు, ఆమె ప్రాణాలను కాపాడి, కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా ఈ ఘటనలో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృత్రిమం అని కృత్రిమ మేధను తీసి పారేయడానికి లేదని అనిపిస్తోంది కదూ..!

Next Story

Most Viewed