Rain alert: రెండు గంటల్లో నగరంలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం

by Mahesh |
Rain alert: రెండు గంటల్లో నగరంలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి కరెంట్ పోవడంతో భయం గుప్పిట్లో ఉండిపోయారు. ఇదిలా ఉంటే రాత్రి కురిసిన వర్షం నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న నగర వాసులకు వాతావరణ శాఖ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా.. మరో రెండు గంటల్లో సికింద్రాబాద్, బేగంపేట, కూకట్‌పల్లి తో పాటు సెంట్రల్, ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story

Most Viewed