- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లోకి ‘మెటా ఏఐ’.. ఇక వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఏఐ అసిస్టెంట్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ బిలియనీర్, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఆధ్వర్యంలోని దిగ్గజ టెక్ సంస్థ ‘మోటా’ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ ‘మెటా ఏఐ’ భారత్‌లోకి అందబాటులోకి వచ్చింది. మెటా సంస్థకు చెందిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసేంజర్ సహా మెటా ఏఐ పోర్టల్లో ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించుకోవచ్చని తాజాగా వెల్లడించింది. ఈ మేరకు మెటా ఎల్ఎల్ఎం మోడల్ లామా 3 ఆధారితమైన మెటా ఏఐని భారత్‌లో ప్రారంభించినట్లు సంస్థ సోమవారం ప్రకటించింది.
అయితే, యూజర్లు మెటా ఏఐని యూజ్ చేయాలంటే వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసేంజర్ మెటా సోషల్ మీడియా యాప్స్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐని ఉపయోగించి యూజర్లు ఈ సోషల్ మీడియా యాప్‌లలో చాటింగ్, కంటెంట్ క్రియేషన్ సహా ఆయా టాపిక్‌లపై ఉచితంగా సర్చ్ చేయవచ్చు. ప్రారంభంలో, మెటా ఏఐ ఆంగ్లంలో అందుబాటులో ఉంటుందని, అత్యంత వేగంగా పనిచేస్తుందని సంస్థ తెలిపింది.
మెటా ఏఐ సాయంతో వాట్సాప్ గ్రూప్ చాట్ దగ్గర్లోని రెస్టారెంట్లు వివరాలు లాంటివి తెలుసుకోవచ్చని, రోడ్ ట్రిప్ ప్లాన్ లాంటివి అడగవచ్చని సంస్థ పేర్కొంది. నిర్దిష్టమైన ప్రశ్నలు అడగవచ్చు, యూజర్లకు పలు రకాలుగా ఈ ఏఐ అసిస్టెంట్ అండగా ఉంటుందని తెలిపింది. ఫేస్‌బుక్ వాడకంలో సైతం ఏఐ ఎంతో సాయంగా ఉంటుందని పేర్కొంది. ఇక ఏఐ ఫోటోలు, వాట్సాప్ స్టిక్కర్లు లాంటివి రూపొందించడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా మెటా ఏఐ చాట్‌బాట్‌ను వెబ్‌లో సైతం నేరుగా యాక్సెస్ చేయవచ్చని సంస్థ వెల్లడించింది.