అదిరిపోయే ఫీచర్స్‌తో Lenovo కొత్త ట్యాబ్

by Harish |   ( Updated:2024-03-26 11:41:41.0  )
అదిరిపోయే ఫీచర్స్‌తో Lenovo కొత్త ట్యాబ్
X

దిశ, టెక్నాలజీ: Lenovo కంపెనీ ఇండియా మార్కెట్లోకి మంగళవారం కొత్త మోడల్ ట్యాబ్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Tab M11’. జనవరిలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2024లో మొదటిసారిగా ఈ ట్యాబ్‌ను ఆవిష్కరించారు. ఇప్పుడు దేశీయ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది WI-Fi, LTE (సిమ్ కార్డ్)వేరియంట్లలో లభిస్తుంది. WI-Fi మోడల్ ధర రూ.18,000. LTE(సిమ్ కార్డ్) ధర రూ. 22,000. దీనిని లెనోవో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి.

Lenovo Tab M11 ఫీచర్స్: టాబ్లెట్ 11-అంగుళాల WUXGA (1,920 x 1,200 పిక్సెల్‌లు) IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 90Hz. HD-నాణ్యత కలిగిన నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత UI తో రన్ అవుతుంది. రెండు సంవత్సరాల వరకు OS అప్‌డేట్, నాలుగేళ్లు సెక్యురిటీ అప్‌డేట్‌లు అందిస్తామని కంపెనీ పేర్కొంటుంది. మెరుగైన సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ ఆడియో కూడా ఉంది. చేతి రాతను టెక్స్ట్‌గా మార్చే ఫీచర్ కూడా ఉంది. ఇది MediaTek Helio G88 SoC ద్వారా పనిచేస్తుంది. ట్యాబ్ వెనుక 13MP కెమెరాను అందించారు. ముందు 8MP కెమెరా ఉంది. దీనిలో USB టైప్-సి పోర్ట్ ద్వారా 15W వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్‌తో 7,040mAh భారీ బ్యాటరీని అమర్చారు. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్‌ కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed