చంద్రయాన్-3పై ఇస్రో కీలక ప్రకటన

by GSrikanth |   ( Updated:2023-08-29 12:13:20.0  )
చంద్రయాన్-3పై ఇస్రో కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్ తన పనిలో నిమగ్నమైంది. జాబిల్లిపై బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకుసాగుతున్నది. రోవర్ కదలికలకు సంబంధించి ఇస్రో తాజాగా మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. నిన్న రోవర్ దాని స్థానానికి 3 మీటర్ల దూరంలో 4 మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద గొయ్యిని గుర్తించింది. రోవర్‌కు ఉన్న నావిగేషన్ కెమెరా తీసిన ఫోటోలతో అప్రమత్తమైన ఇస్రో వెంటనే వెనక్కి రావాలని రోవర్‌కు సంకేతాలు పంపింది. ఇస్రో కమాండింగ్‌తో దారి మార్చుకున్న రోవర్ విజయవంతంగా కొత్త మార్గంలో పయనిస్తున్నట్లు ఇస్రో స్పష్టం వెల్లడించింది. రోవర్ కదలికలకు సంబంధించి రెండు ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై అడ్డంకులను అధిగమిస్తూ ప్రజ్ఞాన్ సాగిస్తున్న ప్రయాణంపై శాస్త్రవేత్తలు ఇస్తున్న అప్ డేట్స్ ఆసక్తితో పాటు ఉత్కంఠను రేపుతున్నాయి.

Advertisement

Next Story