- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోనీ కెమెరా సెన్సార్‌తో అదిరిపోయే iQoo కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే
దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ iQoo ఇండియాలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘iQoo Z9 5G’. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999. 8GB RAM + 256GB ధర రూ.21,999. ఫోన్ మార్చి 14 నుంచి అమెజాన్, iQoo ఇండియా స్టోర్, ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో ICICI, HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ మోడల్‌కు రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్ల పాటు సెక్యురిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంటుంది.
iQoo Z9 5G ఫీచర్స్: ఫోన్ 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14పై రన్ అవుతుంది. MediaTek డైమెన్సిటీ 7200 5G SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే 50-మెగాపిక్సెల్ Sony IMX88 ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. ముందు సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా అందించారు.
మెమరీని మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కచార్జింగ్‌తో 67.78 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్,17 గంటల వరకు YouTube వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. కేవలం 31 నిమిషాల్లో బ్యాటరీ 0 నుంచి 50 శాతం చార్జ్ అవుతుంది. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం ఫోన్ IP54 రేటింగ్ కలిగి ఉంది.