- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Instagram Reels download feature : ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్!
దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ మరో అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసింది. రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఆప్షన్‌ను కంపెనీ విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్ కోసం చాలా మంది యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.
అధికారికంగా రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌ల సహాయంతో రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవారు. నేరుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోనే రీల్స్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇవ్వాలని చాలా మంది కంపెనీని అభ్యర్థించారు. దీనికి సంబంధించి తాజాగా కంపెనీ హెడ్ ఆడమ్ మోస్సేరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకమీదట రీల్స్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అయితే, పబ్లిక్ ఖాతాల ద్వారా పోస్ట్ చేయబడిన రీల్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి లింక్‌ను కాపీ చేయాల్సిన అవసరం లేకుండా డౌన్‌లోడ్ చేసిన వీడియోలను నేరుగా వాట్సాప్, ఇతర సోషల్ మీడియా యాప్‌లలో షేర్ చేయవచ్చు. ఇంతకుముందు రీల్స్ షేరింగ్ చేయాలంటే ఆ క్లిప్ లింక్‌ను కాపీ చేసి షేర్ చేయాల్సి వచ్చేది.