సెప్టెంబర్ 2 న Infinix Zero 30 5G స్మార్ట్‌ఫోన్

by Harish |
సెప్టెంబర్ 2 న Infinix Zero 30 5G స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ నుంచి కొత్తగా ఒక కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కాబోతుంది. దీని పేరు ‘Infinix Zero 30 5G’. సెప్టెంబర్ 2 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోడానికి అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఫోన్‌లో ప్రధానంగా ముందు, వెనక కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అమర్చారు. ఇది 6.78-అంగుళాల కర్డ్వ్ 10-బిట్ AMOLED ప్యానెల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4K రిజల్యూషన్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌గా ఉంది.

దీనిలో ముందు కెమెరాను 50-మెగాపిక్సెల్ అందించారు. దీంతో హై క్వాలిటీ కలిగిన సెల్ఫీలను తీసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ 60fpsతో వీడియో రికార్డింగ్‌ను చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది MediaTek Dimensity 8020 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేసే అవకాశం ఉంది. ఫోన్‌లో బ్యాక్ సైడ్ 108 MP ప్రధాన కెమెరా ఉండనుంది. భారత్‌లో అంచనాల ప్రకారం, దీని ధర రూ.25,000 వరకు ఉండే అవకాశం ఉంది.

Advertisement

Next Story