- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అద్భుత సృష్టి..మానవ మూత్రంతో విద్యుత్ తయారీ
దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. మనం ఊహించని ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మానవుడు తన మేధస్సును ఉపయోగించి టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇక నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.
తాజాగా పరిశోధకులు మరో అద్భుతాన్ని సృష్టించారు. మానవ మూత్రం నుంచి విద్యుత్, జీవ ఎరువును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ విధానంలో ఉత్పత్తయిన విద్యుత్తును మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు, ఎల్‌ఈడీ బల్బులను వెలిగించేందుకు ఉపయోగించినట్లు వారు తెలిపారు.
పరిశోధకులు సాకితికతనుపయోగించి మూత్రంలోని అయానిక్ బలాన్ని ఉపయోగిస్తారు, తద్వారా అది విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. అలాగే నత్రజని, భాస్వరం, మెగ్నీషియం బయోఫెర్టిలైజర్ తయారీకి ఉపయోగపడుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీలో ఎలక్ట్రోకెమికల్ రియాక్టర్, అమ్మోనియా అడ్సార్ప్షన్ కాలమ్, డీకోలరైజేషన్, క్లోరినేషన్ ఛాంబర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మానిఫోల్డ్స్ ఉంటాయి. విద్యుత్, బయోఫెర్టిలైజర్‌లను ఏకకాలంలో ఉత్పత్తి చేసే ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యలను ప్రేరేపిస్తూ ఈఆర్‌ఆర్‌ఆర్‌లోకి మూత్రాన్ని పంపిస్తారు. ఫలితంగా విద్యుత్‌తో పాటు, బయో ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఇలా మానవ మూత్రం నుంచి విద్యుత్, జీవఎరువును తయారు చేశారు. ఇక ఈ జీవ ఎరువులో మంచి పోషక విలువలు ఉంటాయి. ఇది వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు తెలుపుతున్నారు.