క్రెడిట్ కార్డు తీసుకొని డ్యూ చెల్లించకుండా చనిపోతే.. ఆ బిల్ ఎవరు పే చేయాలి?

by Jakkula Samataha |
క్రెడిట్ కార్డు తీసుకొని డ్యూ చెల్లించకుండా చనిపోతే.. ఆ బిల్ ఎవరు పే చేయాలి?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలా మంది కాల్స్ చేసి క్రెడిట్ కార్డు తీసుకోండి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటూ అనేక ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడమే కాకుండా, కార్డు తీసుకుంటున్నారు.అయితే క్రెడిట్ కార్డు తీసుకొని కార్డు వాడుకొన్న తర్వాత దాని మీద నెలకు ఇంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. లేదా నెలకు ఇంత అంటూ ఈ‌ఎమ్ఐ పే చేయాల్సి వస్తుంది.అయితే ఒక వేళ క్రెడిట్ కార్డు తీసుకొని, దానిని ఉపయోగించిన తర్వాత దాని మీద ఉన్న అప్పు చెల్లించకుండా ఆ వ్యక్తి చనిపోతే ఏం చేయాలి. ఆ డ్యూను కార్డు తీసుకున్న వ్యక్తి కుటుంబసభ్యులే చెల్లించాలా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే క్రెడికార్డ్ లో కొన్ని టెర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఈ విషయం గురించి క్లియర్‌గా ఉంటుంది.కార్డు హోల్డర్ చనిపోతే అనే సెక్షన్‌లో.. అంటే కుటుంబ సభ్యులు కొన్ని సార్లు డ్యూ చెల్లించాల్సి వస్తుంది. కాకపోతే కొన్ని మినహాయింపులు ఉంటాయంట. ఆక్సిడెంటల్ డెత్ అయితే కార్డ్ లిమిట్‌ని బట్టి బ్యాంకులు రూ.50,000ల వరకు మినహాయింపు ఇస్తాయంట. అయితే ఇది ఓన్లీ కార్డు యాక్టివ్‌గా ఉన్న వారికే వర్తిస్తుంది. లాస్ట్ 90 డేస్‌లో కార్డు యూజ్ చేసి ఉండాలి. అయితే క్రెడిట్ కార్డు కంపెనీలు చనిపోయిన వాళ్ల పేరు మీద కుటుంబ సభ్యుల ఎవరికీ నోటీసులు అయితే పంపరంట.

మరో విధంగా చెప్పాలంటే, క్రెడిట్ కార్డు హోల్డర్‌కు, బ్యాంకుకు మధ్య మాత్రమే ఒప్పందం ఉంటుంది. దీనికి కుటుంబ సభ్యులు ఏ విధమైన సాక్షులు కారు. అందుకే బ్యాంకు వారు హోల్డర్ మీద కవరేజ్ తీసుకుంటారు, ఆ ప్రీమియం కూడా హోల్డర్ ఖాతాల పడుతుంది. హోల్డర్ మరణిస్తే, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా అతని అప్పు ఆగిపోతుంది. ఒక వేళ అతని అప్పును బట్టీ చనిపోయిన వ్యక్తికి ఏమైనా ఆస్తి ఉంటే సీజ్ చేసే అవకాశం ఉంటుందంట. ( ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది)

Advertisement

Next Story

Most Viewed