ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్.. కొనాలనుకున్నవారు ఈ డీల్ మిస్ అవ్వకండి!

by Prasanna |   ( Updated:2023-11-10 06:34:58.0  )
ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్.. కొనాలనుకున్నవారు ఈ డీల్ మిస్ అవ్వకండి!
X

దిశ,వెబ్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం అక్టోబర్ 7న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు పై భారీ తగ్గింపులు, ఆఫర్‌లను అందిస్తుంది. ఐఫోన్ 13ని భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఫోన్ కొనేవారికి ఇదే మంచి అవకాశం. iPhone 13 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బ్లూ కలర్ వేరియంట్‌లో రూ. 50,498కి లిస్ట్ చేయబడింది. ఐఫోన్ 15 లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 13 ధర రూ.59,900కి తగ్గింది. దీంతో ఐఫోన్ 13పై రూ.9,402 తగ్గింపు లభిస్తుంది.అదనంగా, కస్టమర్లు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్లాట్ రూ. 2000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.45,000 వరకు భారీ తగ్గింపును పొందవచ్చు.

Advertisement

Next Story