2.8K OLED డిస్‌ప్లేతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన HP

by Harish |   ( Updated:2024-04-03 10:19:17.0  )
2.8K OLED డిస్‌ప్లేతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన HP
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ పీసీ తయారీ కంపెనీ HP ఇండియాలో కొత్త మోడల్ ల్యాప్‌టాప్‌ను బుధవారం విడుదల చేసింది. దీని పేరు ‘HP Omen Transcend 14’. ఈ మోడల్‌ను జనవరిలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2024 సందర్భంగా ఆవిష్కరించగా, ఇండియాలో ఈ రోజు విడుదల చేశారు. ఇది హైపర్‌ఎక్స్ మౌస్, హెడ్‌సెట్‌తో పాటు ఉచిత బ్యాగ్‌తో వస్తుంది. షాడో బ్లాక్ కలర్ ధర రూ.1,74,999. సిరామిక్ వైట్ ధర రూ.1,75,999. ప్రస్తుతం దేశంలో అమెజాన్, HP ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ HP వరల్డ్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది.

Omen Transcend 14 ఫీచర్స్: ల్యాప్‌టాప్ 14-అంగుళాల 2.8K (2,800 x 1,800 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఇది తక్కువ బ్లూ లైట్ ప్రొటెక్షన్, ఎడ్జ్-టు-ఎడ్జ్ గ్లాస్‌‌‌తో వస్తుంది. యూజర్ల కంటికి ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి పలు ఫీచర్లను అందించారు.

ల్యాప్‌టాప్ 8GB RAM, NVIDIA GeForce RTX 4060 GPUతో కూడిన ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155H ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 16GB RAM కూడా ఉంది. స్టోరేజ్ మెమరీ 1TB వరకు ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 హోమ్‌‌ను ముందే ఇన్‌స్టాల్ చేశారు. యూజర్ల కోసం HP ట్రూ విజన్ 1080p పూర్తి-HD IR కెమెరాను అమర్చారు. ఇది నాలుగు-జోన్ RGB బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. DTS X అల్ట్రాకు మద్దతుతో HyperX ఆడియో సపోర్ట్ ఉంటుంది. చార్జింగ్ పోర్ట్ USB టైప్-C. 140W వైర్డు ఫాస్ట్ చార్జింగ్‌‌‌తో 71Wh బ్యాటరీని అందించారు. గేమింగ్ వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది. ల్యాప్‌టాప్ బరువు 1.63kg.

Advertisement

Next Story

Most Viewed