Honor: అదిరిపోయే కెమెరా ఫీచర్లతో Honor కొత్త స్మార్ట్‌ఫోన్

by Harish |
Honor: అదిరిపోయే కెమెరా ఫీచర్లతో Honor కొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హానర్ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Honor Magic 6 Pro 5G’. ఇది ప్రత్యేకమైన కెమెరా ఫీచర్లతో లాంచ్ అయింది. ముఖ్యంగా కెమెరాలో 100x డిజిటల్ జూమ్ ఆప్షన్‌ను అందించారు. అలాగే క్రింద పడిన కూడా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండటానికి క్రిస్టల్ షీల్డ్‌ను అమర్చారు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా ఇచ్చారు. 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 89,999. అమెజాన్, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌, హానర్‌ వెబ్‌సైట్‌లో ఆగస్టు 15 నుంచి అమ్మకానికి ఉంటుంది. కొనుగోలు సమయంలో బ్యాంకు తగ్గింపులు కూడా ఉన్నాయి.


Honor Magic 6 Pro 5G స్పెసిఫికేషన్స్

* 6.8-అంగుళాల పూర్తి-HD+ (1,280x2,800 పిక్సెల్‌లు) క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే

* 120Hz రిఫ్రెష్‌ రేటు, 5,000 నిట్‌ల గరిష్ట HDR బ్రైట్‌నెస్‌

* ఆండ్రాయిడ్ 14 ఆధారంగా MagicOS 8.0పై రన్ అవుతుంది.

* స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ద్వారా పనిచేస్తుంది.

* బ్యాక్‌సైడ్ 180MP 2.5x పెరిస్కోప్, 100x డిజిటల్ జూమ్‌తో 50MP,50MP కెమెరాలు

* ముందు సెల్ఫీల కోసం 50MP కెమెరా ఉంది.

* 80W వైర్డు చార్జింగ్, 66W వైర్‌లెస్ చార్జింగ్‌తో 5,600mAh బ్యాటరీని అందించారు.

* చార్జింగ్ కేవలం 40 నిమిషాల్లో ఫుల్ అవుతుందని కంపెనీ తెలిపింది.

* నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68-రేట్ కలిగి ఉంది.

Advertisement

Next Story