- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google : గూగుల్ వినియోగదారులకు కీలక అప్‌డేట్
దిశ, టెక్నాలజీ: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ తన వినియోగదారులకు కీలక అప్‌డేట్‌ను అందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారంగా పనిచేసే చాట్‌బాట్ జెమినిలో వ్యక్తుల ఫొటోలను రూపొందించే సామర్థ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు గూగుల్ ప్రకటించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఫొటోల వివరణలో తప్పులు వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్‌ను పాజ్ చేసినట్లుగా పేర్కొంది. అలాగే, త్వరలో మెరుగైన వెర్షన్‌ను విడుదల చేస్తామని గూగుల్ తెలిపింది.
గూగుల్ ఈ నెల ప్రారంభంలో జెమిని AI మోడల్ ద్వారా ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రారంభించింది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది వినియోగదారులు ఈ మోడల్ చారిత్రక ఫొటోలకు సంబంధించి తప్పుడు డేటా అందిస్తుందని ఫిర్యాదులు చేశారు. దీంతో ఇమేజ్ జనరేషన్ ఫీచర్ సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ తదుపరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయాణంలో జెమిని ముఖ్యమైందని అన్నారు. గూగుల్ చాట్‌బాట్ బార్డ్‌ను జెమినిగా మార్చారు. ఇది వెబ్‌లో 40 భాషల్లో అందుబాటులో ఉంది. కోడింగ్, వివిధ ప్రశ్నలకు సమాధానాలు అందించడం వంటివి చేస్తుంది.
- Tags