Google has made several security recommendations for the Chrome browser

by Harish |   ( Updated:2023-01-29 10:59:49.0  )
Google has made several security recommendations for the Chrome browser
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తుంది. రోజు రోజుకు దీని వాడకం పెరిగిపోతుంది. దీంతో పాటు క్రమంగా సైబర్ దాడులు కూడా పెరుగుతున్నాయి. మన రోజువారీ కార్యక్రమాలు, వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు తదితర ఇన్ఫర్మేషన్ అంత కూడా హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వినియోగిస్తున్న Google Chrome తన వినియోగదారులకు డేటా భద్రత విషయంలో పలు సూచనలను సిఫార్సు చేసింది. తన బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నవారు సెక్యురిటీ విషయంలో ప్రైవసీ సెట్టింగ్స్, పాస్‌వర్డ్ మొదలగు భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరింది.

బ్రౌజర్‌లో ప్రైవసీ అండ్ సెక్యురిటీ ట్యాబ్‌లోకి వెళ్లి సేఫ్ బ్రౌజింగ్ ఎంచుకోవాలి. అలాగే , రోజువాడే వివిధ రకాల సైట్‌లకు పెట్టుకునే పాస్‌వర్డ్స్‌ను సులభంగా ఉండే విధంగా కాకుండా గూగుల్ సూచించినటువంటి బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాప్స్ కాకుండా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ వాడుకోవడం ఉత్తమం. రెగ్యూలర్ సేఫ్ చెకింగ్ బ్రౌజర్‌ను ఎంచుకోవాలి. బ్రౌజర్‌ను ఉపయోగించిన తరువాత ఎప్పటికప్పుడు హిస్టరీ క్లియర్ చేయాలి. దీని ద్వారా డేటా ఇతరులకు యాక్సిస్ కాకుండా ఉండటమే, కాకుండా డివైజ్ ఆపరేటింగ్ స్పీడ్ మరింత వేగంగా అవుతుంది. బ్యాంకు సంబంధిత పాస్‌వర్డ్స్‌ను బ్రౌజర్‌లో సేవ్ చేయకపోవడం ఉత్తమం. iOS వినియోగదారులు క్రోమ్ సెట్టింగ్‌లలో Incognito ట్యాబ్‌ని లాక్ చేయడం చేయడం మర్చిపోవద్దు.

Advertisement

Next Story