- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Fire-Boltt నుంచి అపోలో 2 స్మార్ట్‌వాచ్
దిశ, వెబ్‌డెస్క్: ఫైర్-బోల్ట్ కంపెనీ ఇండియాలో కొత్తగా ‘అపోలో 2’ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తున్న ఈ వాచ్ ధర రూ. 2,499. Fire-Boltt అధికారిక వెబ్‌సైట్, Flipkart ద్వారా అమ్మకానికి ఉంది. ఇది బ్లాక్, డార్క్ గ్రే, గ్రే, పింక్ అనే నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.
ఫైర్-బోల్ట్ అపోలో 2 స్పెసిఫికేషన్స్
ఈ వాచ్ 466x466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని బాడీ మెటాలిక్‌తో తయారు చేయబడింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా వాచ్ నుంచి నేరుగా కాల్స్ చేయవచ్చు, ఆన్సర్ చేయవచ్చు. స్మార్ట్‌వాచ్‌లో గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి AI వాయిస్ అసిస్టెంట్‌లు కూడా ఉన్నాయి. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎక్కువ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కూడా కలిగి ఉంది. అపోలో 2 స్మార్ట్‌వాచ్ ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను, స్టాండ్‌బై మోడ్‌లో 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Read More..