Elon Musk: రెండో మనిషి మెదడులోనూ విజయవంతంగా ఎలక్ట్రానిక్ చిప్.. మస్క్ సంచలన ప్రకటన

by Ramesh Goud |
Elon Musk: రెండో మనిషి మెదడులోనూ విజయవంతంగా ఎలక్ట్రానిక్ చిప్.. మస్క్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చిన న్యూరాలింక్ తాజాగా మరో వ్యక్తిలోను దాన్ని అమర్చి విజయం సాధించినట్లు కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ వెల్లడించారు. టెక్ దిగ్గజం, స్పెస్ ఎక్స్, న్యూరాలింక్ కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్ చిరకాల వాంఛలో మరో ముందడుగు పడింది. మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి కంప్యూటర్ తో నేరుగా సమన్వయం చేసుకునేలా ఓ డివైజ్ ను అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని మనిషి మెదడులో అమర్చామని అది విజయవంతంగా పని చేస్తోందని ఎలాన్ మస్క్ జనవరిలో ప్రకటించగా.. ఇప్పుడు మరో మనిషిలో కూడా అమర్చినట్లు ఓ పాడ్ కాస్ట్ లో చెప్పారు. ఇందులో దాదాపు 400 ఎలక్ట్రోడ్ లు యాక్టివ్ గా పని చేస్తున్నాయని, క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ ఏడాది మరో ఎనిమిది మందికి అమర్చనున్నట్లు సమాచారం ఇచ్చారు.

అంతేగాక తొలిచిప్ ను అందుకున్న వ్యక్తినోలాండ్ అర్బాగ్ సహా మరో ముగ్గురు న్యారాలింక్ ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారని, చిప్ ను అమర్చే విధానంతో పాటు శస్ట్ర చికిత్సకు సంబందించిన విషయాలను కూడా వివరించారు. ఇక చిప్ అమర్చిన తొలి రోజుల్లో అర్బాగ్ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడని, కొన్ని ఎలక్ట్రోడ్ మెదడు నుంచి బయటకి వచ్చాయని, ఈ సమస్యను ముందే పసిగట్టి సమర్ధంగా పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే అర్బాగ్ కంప్యూటర్ ఆపరేట్ చేసే విషయంలో రికార్డ్ నెలకొల్పాడని మస్క్ వెల్లడించారు. కాగా ఇది గతంలో పందులు, కోతుల్లో విజవంతంగా పరీక్షించగా.. దీనికి అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. అంతేగాక ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైనదని సంస్థ నిపుణులు వెల్లడించారు. దీనిని ఓ కోతి మెదడులో అమర్చి పాంగ్ వీడియో గేమ్ ఆడినట్లు నిపుణులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed