- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదిరిపోయే ఫీచర్స్‌తో రూ.1,299 కే స్మార్ట్‌వాచ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్, మొబైల్ యాక్సెసరీస్‌ల తయారీ కంపెనీ Elista, ఇండియాలో కొత్తగా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘SmartRist E’. ఈ సిరీస్‌లో SmartRist E-1, SmartRist E-2, SmartRist E-4 వంటి వేరియంట్లు ఉన్నాయి. Elista కంపెనీ స్టోర్‌లో, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,299. ఈ స్మార్ట్‌వాచ్‌ల డిజైన్ సరికొత్తగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. E-1, E-2 లు 2.01-అంగుళాల IPS డిస్‌ప్లే (240 x 296 పిక్సెల్‌లు)ని కలిగి ఉంటాయి. వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్క చార్జీంగ్‌పై దాదాపు 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలిపింది.
వాచ్‌లపై ఫ్రేమ్ వాటర్-రెసిస్టెంట్ మెటాలిక్‌గా వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో వాచ్ నుంచి నేరుగా కాల్స్ చేయవచ్చు. ఆన్సర్ చేయవచ్చు. Android, iOS స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు సులభంగా కనెక్ట్ అవుతుంది. ఈ వాచ్‌లలో హెల్త్ కోసం Spo2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, స్లీప్ మానిటర్, ఫిట్‌నెస్ మానిటరింగ్ ఇంకా ఆల్‌వెస్ ఆన్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి.