కొత్త ఐఫోన్ 15పై రూ. 13 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్న ఫ్లిప్‌కార్ట్

by S Gopi |   ( Updated:2024-01-26 13:03:28.0  )
కొత్త ఐఫోన్ 15పై రూ. 13 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్న ఫ్లిప్‌కార్ట్
X

దిశ, టెక్నాలజీ: కొత్త ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ తీసుకొచ్చింది. ఐఫోన్ 15 సిరీస్‌ 128జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డిస్కౌంట్ కింద 66,999కే అందిస్తోంది. 2023, సెప్టెంబర్ ఈ ఫోన్ విడుదల సమయంలో దీని ధర రూ. 79,900గా ఉంది. అంటే ఒరిజినల్ ధర కంటే రూ. 13,000కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లను ఉపయోగించడం ద్వారా ఐఫోన్ 15ను మరింత తక్కువ సొమ్ముకే సొంతం చేసుకోవచ్చు. పాత ఐఫోన్ లేదంటే ఇతర స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఇంకా తక్కువ ధరకే ఐఫోన్ 15ను దక్కించుకునే అవకాశం ఉంది. మిగిలిన వాటిలో 256జీబీ రూ. 76,999, 512జీబీ రూ. 96,999కి లభిస్తోంది. బ్యాంకు కార్డు ద్వారా చెల్లింపులు చేసినవారికి ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ. 2,000 రాయితీ ఇస్తోంది. పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 54,990 వరకు తగ్గింపును అందిస్తోంది. ఉదాహరణకు, మీరు ఐఫోన్ 15 కోసం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 46,149 వరకు, ఐఫోన్ 12 లాంటి పాత ఐఫోన్ ఉంటే ట్రేడింగ్ ద్వారా రూ. 20,850 వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఇక, నో-కాస్ట్ ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు.

Advertisement

Next Story