పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల వద్ద మీ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టవద్దు: FBI

by Mahesh |
పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల వద్ద మీ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టవద్దు: FBI
X

దిశ, వెబ్‌డెస్క్: విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్..ఫుడ్ కోర్ట్స్ వంటివి ఉచిత ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ చార్జీంగ్ పాయింట్ల వద్ద ఫోన్‌లను ఛార్జ్ చేయవద్దని FBI ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇలా చేయడం USB పోర్ట్‌ల ద్వారా.. మాల్వేర్, మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌ హాంగ్ అవుతుందని FBI తెలిపింది. కేవలం మీ సొంత ఛార్జర్, USB కేబుల్‌ను మాత్రమే వాడాలని FBI సూచించింది. లేదంటే ఫోన్ లో ఉన్న డేటా దొంగతనానికి గురికావచ్చు అని FBI అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed