- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dizo Watch D: భారత్‌లోకి అడుగుపెట్టిన యాపిల్ తరహా స్మార్ట్ వాచ్
దిశ, వెబ్‌డెస్క్: Dizo Watch D smartwatch from Realme Techlife| ప్రముఖ సంస్థ Realme TechLife సబ్‌బ్రాండ్ Dizo నుంచి కొత్త స్మార్ట్ వాచ్ విడుదలయింది. దీని పేరు Dizo Watch D. ఇది డిజైన్ పరంగా యాపిల్ వాచ్‌ను పోలీ ఉంటుంది. పెద్ద డిస్‌ప్లేతో వస్తున్నటువంటి ఈ వాచ్ అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. స్మార్ట్‌వాచ్ 110+ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. సరికొత్త డిజో వాచ్ డి(Dizo Watch D) ధర కేవలం రూ.2,999. కానీ పరిమిత కాలం వరకు ఆఫర్‌లో రూ.1,999 ధరకు లభిస్తుంది.
స్పెషిఫికేషన్లు..
* 1.8-inch (4.57 cm) డిస్‌ప్లేను కలిగి ఉంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న మిగతా వాచ్‌ల కంటే ఇది 15 శాతం పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది.
* 550నిట్స్ హై బ్రైట్‌నెస్, 240x286 రిజల్యూషన్‌ని కలిగి ఉంటుంది.
* స్మార్ట్‌వాచ్ అన్ని వైపులా కర్వ్డ్ టెంపర్డ్ గ్లాస్, మెటల్ ఫ్రేమ్‌ను అందిస్తుంది.
* 150+ వాచ్ ఫేసెస్‌తో ఇంటరాక్టివ్ డయల్స్.
* జిమ్నాస్టిక్స్, యోగా, హైకింగ్, డ్యాన్స్, కరాటే, గుర్రపు స్వారీలతో పాటు స్టాండర్డ్ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి 110+ స్పోర్ట్స్ మోడ్‌లతో స్మార్ట్‌వాచ్ వస్తుంది.
* రక్తంలోని ఆక్సిజన్ (SpO2) స్థాయిలను, హృదయ స్పందన రేటు, నిద్రను ట్రాక్ చేస్తుంది. త్రాగే నీటి రిమైండర్‌లను పంపుతుంది.
* 5ATM వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేట్‌తో, నీళ్ళలో 50 మీటర్ల లోతు వరకు పనిచేస్తుంది.
* బ్లూటూత్ v5.0 కనెక్టివిటీ.
* బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఈ వాచ్‌ను కనెక్ట్ చేసుకొని కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా అలెర్ట్‌లు, నోటిఫికేషన్‌లు పొందవచ్చు.
* మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఫైండ్ ఫోన్, అలారమ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
* 350mAh బ్యాటరీ కలిగి ఉంది. 14 రోజుల వరకు చార్జింగ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.
* జూన్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్‌లో ఈ వాచ్ అమ్మకానికి ఉంటుంది.
- Tags
- smartwatch