Vivo సంస్థ వారు విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ వివరాలివే !

by Prasanna |   ( Updated:2022-11-22 05:53:36.0  )
Vivo సంస్థ వారు విడుదల చేసిన కొత్త  స్మార్ట్ ఫోన్ వివరాలివే !
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం సగం టెక్నాలజీ మీదే నడుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.. 90 % ప్రపంచం స్మార్ట్ ఫోన్ లోనే కనిపిస్తుంది.ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటీ పడుతూ 5G స్మార్ట్ ఫోన్స్‌ను మన ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా వివో సంస్థ వారు 5G స్మార్ట్ ఫోన్ మోడల్స్‌లో ఈ మూడు సీరీస్‌ల స్మార్ట్ ఫోన్స్‌ను మన ముందుకు తీసుకురానున్నారు. వివో ఎక్స్ 90, వివో ఎక్స్‌90ప్రొ, వివోఎక్స్‌90 ప్రొ ప్లస్ అతి త్వరలో మన ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

వివో ఎక్స్ 90 ( Vivo X 90 ) ఫీచర్లు :

6.78 ఇంచుల గల డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. వివో ఎక్స్‌90 ప్రొలో స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా అమరి ఉంటుంది. బ్యాటరీ సామర్ధ్యం 4700mAh ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్ టైప్ సి పోర్టు కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ధర గురించి ఎలాంటి విషయాలు బయటికి వెల్లడించలేదు.

Advertisement

Next Story

Most Viewed