ఐఫోన్ 15 సిరీస్‌లో మ్యూట్ బటన్, వాల్యూమ్ బటన్‌లో మార్పులు

by Harish |   ( Updated:2023-06-27 11:19:09.0  )
ఐఫోన్ 15 సిరీస్‌లో మ్యూట్ బటన్, వాల్యూమ్ బటన్‌లో మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ నుంచి త్వరలో రాబోతున్న ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ గురించి ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ సిరీస్ ఫోన్లలో వాల్యూమ్, పవర్ బటన్‌లలో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. చైనాకు చెందినటువంటి మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weiboలో టిప్‌స్టర్ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఐఫోన్‌లకు ప్రక్కన ఇచ్చేటటువంటి మ్యూట్ బటన్ సైజ్‌ను ఇంకా తగ్గించవచ్చు. గతంలో వచ్చిన ఫోన్ల మాదిరిగా కాకుండా వాల్యూమ్ బటన్‌లు, మ్యూట్ స్విచ్ రెండూ ఫోన్ ఎడమ వైపున కొద్దిగా తక్కువగా ప్లేస్ ఆక్రమించేలా డిజైన్ చేసినట్లు నివేదిక పేర్కొంది. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ కోసం ప్రత్యేక బటన్‌లకు బదులుగా, వాల్యూమ్‌ను పైకి లేదా క్రిందికి సర్దుబాటు చేయడానికి ఒకే పొడుగు బటన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే USB టైప్-C పోర్ట్ కోసం దాని చార్జింగ్ పోర్ట్ సైజు కూడా కొంచెం పెద్దదిగా డిజైన్ చేశారు.

Read More..

Amazfit ‘Pop 3R’ స్మార్ట్ వాచ్.. ధర, పూర్తి వివరాలు ఇవే!




Advertisement

Next Story

Most Viewed