అంతరిక్షంలోనా..? అవరోధాల సుడిలోనా..? నాసా ఉచ్చులో వ్యోమగామి సునీతా విలియమ్స్

by Indraja |
అంతరిక్షంలోనా..? అవరోధాల సుడిలోనా..? నాసా ఉచ్చులో వ్యోమగామి సునీతా విలియమ్స్
X

దిశ వెబ్ డెస్క్: బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ వ్యోమనౌకను రూపొందించింది. కాగా ఇది మానవసహిత వ్యోమనౌక. జూన్ 5 ఈ వ్యోమ నౌక భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్‌తోపాటుగా బుచ్ విల్మోర్‌తో అంతరిక్షానికి బయలుదేరింది. కాగా ఈ రొధసి యాత్ర ముందుగా 8 రోజులు అనుకున్నారు. అనంతరం యాత్ర గడువును పది రోజులకు పెంచారు. అయితే ఆ తరువాత వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక కారణాల దృష్ట్యా మూడు వారులు గడుస్తున్నా నేటీకీ వారు అంతరిక్షంలోనే ఉన్నారు.

అంతరిక్ష యాత్రకు ఎన్ని ఆటంకాలు.. అన్నీ తెలిసీ సన్నాహాలు..

నాసా యొక్క వాణిజ్య క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా బోయింగ్ సంస్థ తయారు చేసిన మానవసహిత స్టార్‌లైనర్ వ్యోమనౌకను టెస్ట్ చేయడానికి గత నెలలో ప్రముఖ ఆస్ట్రోనాట్స్ సునీత, బుచ్‌ను రోధసికి పంపడాని నాసా నిర్ణంయించింది. అయితే స్పేస్‌క్రాఫ్ట్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఈ యాత్ర మూడు సార్లు వాయిదా పడింది. అయితే నాలుగోసారి మళ్లీ గగణతలానికి నాసా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో వ్యోమ నౌక భూమిపై ఉన్నప్పుడే అందులో సాకేతిక సమస్యలను గుర్తించినా ఏంకాదులే అనే నిర్లక్ష్యంతో వ్యోమగాములను నాసా అంతరిక్షానికి పంపిందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

పేలిన రష్యా ఉపగ్రహం.. రెండు నెలల ముందే హెచ్చరిక..

మూలిగే నక్కపై తాటిపండు పడింది అన్నట్టుగా ముందే వ్యోమనౌకలో తలెత్తిన సాకేతిక సమస్యలు, హీలియం లీకేజ్ వంటి అవరోధాలతో సతమతమౌతున్న నాసాకు తాజాకా పేలిన రష్యా ఉపగ్రహం తలనొప్పిగా మారింది. వాస్తవానికి అంతరిక్షంలోని రష్యా ఉపగ్రహం డెడ్‌ అయిందని, అది ఎప్పుడైనా పేలొచ్చని దాదాపు రెండు నెలల క్రితమే రష్యా ప్రకటించింది. అయినా నాసా స్టార్‌లైనర్‌ను అంతరిక్షంలోకి పంపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో ప్రయాణించిన వ్యోమనౌక స్పేస్ స్టేషన్‌ను చేరుకున్న తరువాత డెడ్ అయిన రష్యా ఉపగ్రహం పేలిపోయింది. దీనితో విలియమ్స్, బుచ్ విల్మోర్‌ కనీసం స్పేస్ సెంటర్ నుండి బయటకు వచ్చే అవకాశం సైతం లేకుండాపోయినట్టు తెలుస్తోంది.

ప్రామాదం అంచుల్లో వ్యోమగాములు..?

ప్రస్తుతం ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడాయాలోనూ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌ ప్రమాదంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి తాము సురక్షితంగానే ఉన్నమాని, ఆహారం, నీరు అవసరవైన అన్ని వసతులు ఉన్నట్టు వ్యోమగాములు నుండి సమాచారం అందినట్టు నాసా తెలిపింది. అయితే వాళ్లను భూమిపైకి ఎప్పుడు తీసుకువస్తారు అనే అంశంపై నాసా స్పష్టత ఇవ్వలేదు.

ప్రత్యామ్నాయం ఉన్న వెనకడుగు వేస్తుంది నాసా..

వ్యోమగాముల ప్రాణమా..? ప్రతిష్టే ముఖ్యమా అంటే నాసా ప్రతిష్టే ముఖ్యం అని అంటుందని విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములని భూమికి తీసుకు వచ్చేందుకు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్‌ను ఉపయోగించుకోవచ్చు. కాని నాసా మాత్రం అందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతానికి తమకు స్పేస్ ఎక్స్ అవసరం లేదని చెప్తున్నట్టు సమాచారం.

ఏదేనా కారణాల చేత స్పేస్‌ఎక్స్‌ సాయం తీసుకుంటే ఎలన్‌మస్క్ ముందు తాము ఓడినట్టు అవుతుందని నాసా అభిప్రయపడుతుందని అందుకే వ్యోమగాములకు ప్రమాదం ముంచుకొస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు ఉందని పలువురు నాసాపై మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed