Candy Crush: క్యాండీ క్రష్‌ ఆడితే సచ్చారే... ఈ మ్యాటర్‌ తెలుసుకుంటే మళ్లీ జీవితంలో ఆడరు

by Vennela |
Candy Crush: క్యాండీ క్రష్‌ ఆడితే సచ్చారే... ఈ మ్యాటర్‌ తెలుసుకుంటే మళ్లీ జీవితంలో ఆడరు
X

దిశ,వెబ్‌డెస్క్: Candy Crush: మీరు మొబైల్ లో గేమ్స్ ఆడుతుంటారా?అయితే ఈ వార్త మీ కోసమే. మీరు ప్రతిరోజూ ఉపయోగించే యాప్స్ మీపై గూఢచర్యం చేస్తున్నాయని తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే అందులో ఉండే కాండీ క్రష్(Candy Crush) వంటి కొన్ని యాప్స్ (APPS) మీ పర్సనల్ డేటా(Personal data)ను తీసుకుని మనల్ని వాచ్ చేస్తుంటాయి. ఇదేదో మామూలుగా చెబుతున్న మాటలు కాదు ఓ ప్రముఖ మీడియా వెల్లడించిన వివరాల్లో ఈ సమాచారం ఉంది. ఈ స్కామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

క్యాండీ క్రష్ సాగా(Candy Crush Saga), టిన్డర్(Tinder) వంటి ఫేమస్ యాప్స్ నుంచి వినియోగదారులు సమాచారం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ గేమింగ్ యాప్స్(Gaming apps) ను కోట్లాది మంది ఆడుతున్నారు. మరి అంతమంది పర్సనల్ డేటా దొంగతనం జరిగిందంటే ఇదే మామూలు స్కామ్ కాదని అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు గేమ్స్ అంటే చక్కగా ఒకచోట కూర్చుండి నలుగురు స్నేహితులతో కలిసి ఆడుకునేలా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రీ ఫైర్(Free Fire), పబ్జీ (PUBG)లాంటి కొన్ని గేమ్స్ నలుగురు కూర్చొని కలిసి ఆడుకుంటున్నారు. ఇవి ఎంత డేంజరో ఇప్పటికే కొన్ని ఘటనలు రుజువు చేశాయి. అందుకే పబ్జి లాంటి గేమ్స్ ను భారత్ లో బ్యాన్ చేశారు. ఇంకా బ్యాన్ కానీ ఎన్నో ప్రమాదకరమైన గేమ్స్(Dangerous games) మొబైల్ లో దర్శనమిస్తూనే ఉన్నాయి. కొన్ని గేమ్స్ మైండ్ రిలాక్సేషన్ (Mind Relaxation)కోసం ఆడేవిగా ఉంటే.. మరికొన్ని తెలివితేటలు పెంచుకునేవి గా ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే కొన్ని యాప్స్, గేమ్స్ మనం అనుకున్నంత సేఫ్ కావు. జనవరి 9న 404 మీడియా విడుదల చేసిన నివేదిక ఇలాంటి నిజాలను వెల్లడించింది. నిబంధన ఉల్లంఘించి ప్రజాధరణ పొందిన కొన్ని యాప్స్ వినియోగదారుల రియల్ టైం లొకేషన్(Real-time location) చేసి వారి చర్యలను వాచ్ చేస్తున్నాయని ఈ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడించింది.

ఈ డేటా ఉల్లంఘనకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియవు అయినప్పటికీ.. హ్యాకర్ విడుదల చేసిన నమూనా డేటాలో క్యాండీ క్రష్ సాగా, టిన్డర్ వంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారం హ్యాకర్ గ్రేవీ అనలిటిక్స్(Hacker Gravy Analytics) ద్వారా అనేక టెరాబైట్ల యూజర్స్ డేటాను యాక్సెస్ చేశారు. ఇది అమెజాన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్(Amazon Cloud Environment) ద్వారా యాక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గ్రేవీ అనలిటిక్స్ దాని అనుబంధ సంస్థ వెన్టెల్(Ventel) ఏం చేసిందంటే యూజర్ అనుమతి లేకుండా వారి లొకేషన్ డేటాను సేకరించి అమ్మేసింది. వైట్ హౌస్(White House), క్రెమ్లిన్(Kremlin), వాటికన్ సిటీ(Vatican City), ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సైనిక స్థావరాలతో సహా 330 మిలియన్ మంది పైగా లొకేషన్ డేటా పాయింట్స్ లో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

గ్రేవి అనలిటిక్స్ ప్లాట్ఫామ్స్ (Gravy Analytics Platforms)సాధారంగా వినియోగదారుని సమాచారాన్ని సేకరించవు. దానికి బదులుగా ఆండ్రాయిడ్ ఐఓఎస్ పరికరాల్లో వినియోదారుల డేటాను యాక్సెస్ చేయడానికి వారు తరచుగా ఈ సర్వీస్ ఏజెన్సీ లతో కలిసి పనిచేస్తారు. మీరు సేఫ్ గా ఉంచుకోవాలంటే ఇకపై మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేసిన అవసరమైన పర్మిషన్ మాత్రమే ఇవ్వండి. ప్రతిదానికి పర్మిషన్ ఇచ్చేస్తే మీ వ్యక్తిగత సమాచారం దొంగతనానికి గురై ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఐఫోన్ వాడుతూ ఉంటే "Ask Apps Not to Track" ఫీచర్‌ని ఉపయోగించడం బెటర్.

Next Story