వాట్సాప్‌లో అతి చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు!

by Jakkula Samataha |
వాట్సాప్‌లో అతి చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు!
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అనేది తప్పనిసరిగా వాడుతుంటారు. ఇక యూత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు, వారు 24 గంటలు వాట్సాప్‌లో చాట్ చేస్తూనే గడిపేస్తుంటారు. అయితే ఎక్కువ సేపు వాట్సాప్‌లో ఉండేవారికి షాకింగ్ న్యూస్.. త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్‌తో మన ముందుకు రానుంది. వాట్సాప్ రూల్స్‌కు వ్యతిరేకంగా మెసేజ్‌లు పంపితే ఆ వాట్సాప్ అకౌంట్స్‌ను కొన్ని రోజులపాటు బ్లాక్ చేయనుందంట. అయితే ఈ ఫీచర్ కేవలం కొత్త చాట్స్ చేయకుండా మాత్రమే ఆపుతోందని, పాత చాట్స్ కంటిన్యూ చేయొచ్చు అంటున్నారు నిపుణులు.

దీని గురించి వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. తమకు నచ్చినట్లు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తూ అతి చేస్తున్నారు. గత కొంత కాలం నుంచి స్పామ్ మెసేజ్‌లు ఫార్వర్డ్ అవుతున్నాయి.. ఇలాంటి సమస్యల నుంచి వినియోగదారులను సేవ్ చేయడానికే ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు పేర్కొంది. అయితే దీని ద్వారా నిబంధనలను ఉల్లంఘిచిన వారి అకౌంట్‌ను పర్మినెంట్‌గా కాకుండా తాత్కాలికంగా బ్యాన్ చేయనున్నారు. అలాగే వారి వాట్సాప్ ఏ కారణం చేత బ్లాక్ చేయబడినదో అనే విషయాన్ని కూడా యూజర్స్ ఈ ఫీచర్ ద్వారా తెలియజేయనున్నారంట. తాత్కాలికంగా బ్యాన్ చేసినా, చాట్ హిస్టరీకి ఎలాంటి ఇబ్బంది కలగదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే కొత్త ఫీచర్ అకౌంట్స్ ను కాకుండా చాట్స్ ను మాత్రమే చేయకుండా అడ్డుకుంటుందని వివరించింది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నదంట.ఈ అప్ డేట్ వచ్చిన వెంటనే యూజర్లకు అర్థం అయ్యేలా పాప్ అప్ మెసేజ్ బ్లింక్ అవుతుందని,ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ మరింత ప్రొటెక్టివ్ గా ఉంటుందని మెటా సంస్థ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed