- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధునాతన ఫీచర్లతో Amazfit నుంచి రెండు స్మార్ట్ వాచ్‌లు
దిశ, వెబ్‌డెస్క్: Amazfit కంపెనీ కొత్తగా రెండు స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసింది. వీటి పేరు Cheetah, Cheetah Pro. ఇవి కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. Cheetah ధర రూ. 18,700, Cheetah Pro ధర రూ. 24,512. రెండు స్మార్ట్‌వాచ్‌లను Amazfit స్టోర్‌లు, Amazon లో విక్రయించనున్నారు. ఇవి GPS టెక్నాలజీతో వస్తున్నాయి. ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లను అందిస్తాయి.
Amazfit Cheetah స్మార్ట్ వాచ్ 1.39-అంగుళాల (454x454 పిక్సెల్‌లు) HD AMOLED డిస్‌ప్లేతో టెంపర్డ్ గ్లాస్, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కలిగి ఉంది. ఇది లొకేషన్ పాయింట్‌లను కూడా సేవ్ చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రత్యేకంగా మైక్రోఫోన్, స్పీకర్ అమర్చారు. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది.
వాచ్ రన్నింగ్, వాకింగ్ స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, డ్యాన్స్, ఇతర స్పోర్ట్స్‌లతో సహా 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. స్లీప్ ట్రాకింగ్, ఋతు చక్రం ట్రాకింగ్, హెల్త్ రిమైండర్‌లను కూడా కలిగి ఉంది. ఫైండ్ మై ఫోన్, స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనిలో 440 mAh బ్యాటరీని అమర్చారు. స్మార్ట్ వాచ్ Zepp OS 2.0 పై రన్ అవుతుంది.
Amazfit Cheetah Pro 1.45-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ స్టోరేజ్ వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంది. 150 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, Amazfit Cheetah స్టాండర్డ్ వేరియంట్‌లాగానే కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ వాచ్ కూడా 440 mAh బ్యాటరీ కలిగి ఉంది.
Read More..