అలర్ట్ : అర్ధరాత్రి వరకు ఇన్ స్టా చూస్తున్నారా..

by Jakkula Samataha |   ( Updated:2024-01-21 15:56:19.0  )
అలర్ట్ : అర్ధరాత్రి వరకు ఇన్ స్టా చూస్తున్నారా..
X

దిశ, ఫీచర్స్ : యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా టీనేజర్స్ ఇన్ స్టాగ్రామ్‌కే ఎక్కువ ఆకర్షితులయ్యారు.చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఉదయం నుంచిరాత్రైన పడుకోకుండా రీల్స్ చూసి కాలం గడిపేస్తున్నారు. గంటల తరబడి ఇన్ స్టాలోనే గడుపుతుంటారు. అయితే అలాంటి వారికి చెక్ పెట్టడానికి ఇన్ స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా అర్థరాత్రి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నైట్ టైమ్‌ నడ్జ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ఫీచర్‌ సహాయంతో అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపిన వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది. మీరు పరిమితికి మించి ఎక్కువగా ఇన్‌స్టాలో గడిపారు. యాప్‌ను క్లోజ్‌ చేయండి అని హెచ్చరిక చేస్తూ అలర్ట్‌ వస్తుంది. అర్థరాత్రి పదినిమిషాలకంటే ఎక్కువ సేపు ఇన్ స్టా రీల్స్ చూసినా, స్టోరీస్ చూసినా,లేదా మెసేజెస్ ఓపెన్ చేసినా ఈ అలర్ట్ వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed

    null