Acer నుంచి కొత్త ల్యాప్‌టాప్ విడుదల

by Harish |   ( Updated:2023-03-08 10:25:16.0  )
Acer నుంచి కొత్త ల్యాప్‌టాప్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: Acer కంపెనీ ఇండియాలో కొత్తగా ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Acer Swift Go 14’. దీని ధర రూ. 62,990. ఇది Acer ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లు, Croma, Amazonలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ 14-అంగుళాల పూర్తి HD IPS డిస్‌ప్లే‌తో, స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 86-శాతం కలిగి ఉంది. ఇది AMD రైజెన్ 7000 సిరీస్ ప్రాసెసర్, 16 GB RAM గరిష్ఠంగా 2TB వరకు మెమరీ, ప్రత్యేకమైన అప్‌గ్రేడ్ చేసిన కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. Acer ప్యూరిఫైడ్ వాయిస్‌తో పాటు AI నాయిస్ తగ్గింపు కూడా ఉంది. దీనిలో 50Wh బ్యాటరీ ఉంది. ఇది కేవలం 30 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదని ఏసర్ పేర్కొంది. ల్యాప్‌టాప్ బరువు 1.25 కిలోలు.



Advertisement

Next Story