అదిరిపోయే గేమింగ్ టెక్నాలజీతో సరికొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసిన Acer

by Harish |   ( Updated:2023-05-30 13:57:20.0  )
అదిరిపోయే గేమింగ్ టెక్నాలజీతో సరికొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసిన Acer
X

దిశ, వెబ్‌డెస్క్: తైవాన్‌కు చెందినటువంటి ఏసర్(Acer) కంపెనీ ఇండియాలో కొత్తగా గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘ఆస్పైర్ 5(Aspire 5)’. ప్రారంభ ధర రూ.70,990. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కొత్త ల్యాప్‌టాప్ 14-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 1920 x 1200 రిజల్యూషన్‌‌తో IPS టెక్నాలజీతో వస్తుంది. 170 డిగ్రీల వరకు చూసే కోణాన్ని కలిగి ఉంది. 8K వీడియోలకు సపోర్ట్ ఇస్తుంది. ఇది NVIDIA GeForce RTX 2050 తో వస్తుంది. 13th Gen ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీని బరువు 1.57 కిలోలు మాత్రమే.


ఇది ప్రత్యేకంగా గేమింగ్ కోసం AI ఫీచర్లు, రే ట్రేసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌ 16GB RAM, గరిష్టంగా 1TB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది. 65W చార్జర్‌తో 50Wh Li-ion బ్యాటరీ గరిష్టంగా 50 గంటల వినియోగాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుధీర్ గోయెల్ మాట్లాడుతూ, ల్యాప్‌టాప్ ఎక్కడికైన తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుందని దీనికి ఉన్న ఫీచర్స్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటాయని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed