కిలో మీటర్ రాళ్ల రంగులకు అర్థం ఇదే.. ఏ రోడ్డుకు ఏ కలర్ ఉంటుందంటే..?

by Nagaya |
కిలో మీటర్ రాళ్ల రంగులకు అర్థం ఇదే.. ఏ రోడ్డుకు ఏ కలర్ ఉంటుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ రోడ్డు ఎక్కినా కొలత రాళ్లు కనిపిస్తాయి. ఒక గ్రామానికి మరో గ్రామానికి ఎంత దూరం ఉందో తెలిపే రాళ్లు అవి. వీటిని కిలో మీటర్ రాయి అంటారు. గ్రామీణ రోడ్లు మొదలుకొని నేషనల్ హైవేల వరకు ఈ కిలోమీటర్ రాళ్లు కనిస్తాయి. ప్రతి కిలో మీటరుకు ఓ రాయి ఉంటూ దూరాన్ని చూపిస్తూ ఉంటుంది. వెయ్యి మీటర్లను ఒక కిలో మీటరుగా కొలుస్తారు. అయితే ఈ కి.మీ రాళ్లు రోడ్డును బట్టి రంగు మారుతూ ఉంటాయి. అంటే నేషనల్ హైవేకు ఓ కలర్ రాయి ఉంటే రాష్ట్ర రహదారికి మరో రంగు, జిల్లా రోడ్డుకు ఇంకో రంగు ఉంటుంది. ఇలా రోడ్డుకోరంగును కేటాయిస్తూ ఆ రహదారి కేటగిరీలను విభజించారు. మరి ఏ రంగు ఏ రోడ్డుకు సంకేతమో తెలుసుకుందాం.

సహజంగా కి.మీ. రాళ్ల రంగు తెలుపుగా ఉంటుంది. దాని పైన ఎల్లో, గ్రీన్, బ్లాక్, ఆరెంజ్ ఇలా 25 శాతం వరకు మరో రంగు వేసి అది ఏ రకం రోడ్డో తెలిపేలా చేస్తారు. పసుపు మరియు తెలుపు (Yellow and white) రంగులో ఉంటే ఆ రోడ్డు నేషనల్ హైవే (National Highway) అని అర్థం. గ్రీన్ మరియు వైట్ ఉంటే స్టేట్ హైవే (State Highway) మనం మీద ప్రయాణిస్తున్నట్లు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే సిటీ రోడ్డు (City Road)గా భావించాలి. ఆరెంజ్ మరియు వైట్ కలర్లో ఉంటే అది గ్రామీణ రోడ్డు (Rural Road). ఇలా ప్రభుత్వం రోడ్లను విభాగాలు విభజించి కలర్‌ను కేటాయించింది. ఆ రంగును బట్టి మీరు ప్రయాణిస్తున్న రోడ్డు ఏ కేటగిరో తెలుసుకోవచ్చు. వీటిని మైలు రాళ్లు అని కూడా పిలుస్తారు.

Advertisement

Next Story

Most Viewed