You Tube shut Stories feature : యూట్యూబ్ సంచలన నిర్ణయం..

by GSrikanth |   ( Updated:2023-05-27 06:16:24.0  )
You Tube shut Stories feature : యూట్యూబ్ సంచలన నిర్ణయం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రాం తరహాలో యూట్యూబ్‌లో వినియోగించేYouTube to shut 'Stories' feature next monthను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 26 నుంచి స్టోరీస్ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్టోరీస్ ఫీచర్‌ను యూట్యూబ్ 2017లో పరిచయం చేసింది. 10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈజీ అప్‌డేట్‌ షేరింగ్, కంటెంట్‌ ప్రచారం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లను ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తోంది.

ఇందుకు యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు బెస్ట్ అని అనుకుంటోంది. ఎందుకంటే స్టోరీస్ ఫీచర్‌తో పోలిస్తే యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు.. ఎక్కువ వ్యూయర్ షిప్‌తో పాటు.. కామెంట్‌లు, లైక్‌లు వస్తాయి. ఇవి యూజర్లకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి. వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది పొడవునా కొత్త ఫీచర్‌లతో షార్ట్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లను మెరుగుపరచడం కొనసాగిస్తామని యూట్యూబ్ చెబుతోంది.

Black Raisins: వీటిని నానబెట్టి తింటే చాలు.. ఏ వ్యాధులు కూడా రావట?

Advertisement

Next Story

Most Viewed