- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామమందిరంలో వీఐపీ దర్శనం.. సైబర్ నేరగాళ్ల కొత్త వ్యూహం
దిశ, ఫీచర్స్ : సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరో మోసం వెలుగుచూస్తుంది. రామమందిరంలో దర్శనం కోసం వీఐపీ దర్శనం పేరుతో మోసం మొదలైంది. వాట్సాప్ లో తెలియని నంబర్ల నుండి కొంతమంది వ్యక్తులు సందేశాలు పంపిస్తున్నారు. లక్షలాది మందికి వస్తున్న ఈ మెసేజ్ ఒక స్కామ్ అని సైబర్ అధికారులు చెబుతున్నారు.
అయోధ్య రామమందిరంలో విగ్రహప్రతిష్టాపనకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్షలాది మంది రామభక్తులు దర్శనం కోసం ఉవ్విళ్లూరుతుండగా, మరోవైపు మోసగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రామ్ లల్లాను వీఐపీ దర్శనం చేసుకోండి అంటూ ప్రజలకు కొన్ని నంబర్ల నుండి వాట్సాప్‌లో సందేశాలు వస్తున్నాయి.
వాట్సాప్‌లో వస్తున్న మూడు రకాల సందేశాలు..
మొదటి సందేశంలో రామ్ జన్మభూమి గృహసంపర్క్ అభియాన్ APK వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది మెసేజ్ కాదు APK ఫైల్. పొరపాటున కూడా ఈ ఫైల్ పై క్లిక్ చేస్తే మోసపోతారని నిపుణులు చెబుతున్నారు.
రెండవ మెసేజ్‌లో VIP యాక్సెస్ పొందడానికి రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్‌ని ఇన్‌స్టాల్ చేయండి అని వస్తుంది. ఇది కాకుండా, మూడవ సందేశంలో అభినందనలు, మీరు అదృష్టవంతులు, జనవరి 22న రామాలయంలో దర్శనానికి మీకు వీఐపీ ప్రవేశం లభిస్తుంది అని వస్తుంది.
ఇలాంటి మోసపూరిత సందేశాలు పంపుతూ సైబర్ నేరగాల్లు ప్రజలను మోసం చేస్తున్నారు. పొరపాటున APK ఫైల్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ చేయబడి మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
ఈ తప్పు చేయకుండా ఉండండి
మీకు కూడా అలాంటి సందేశం వస్తే, ముందుగా మీరు సందేశంలో ఇచ్చిన ఏదైనా లింక్ పై పొరపాటున కూడా క్లిక్ చేయకూడదు.
అలాంటి సందేశాన్ని ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దు.
మూడవ పని, అయోధ్యలో రామమందిరం పేరుతో అలాంటి సందేశం వస్తే వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి. నివేదించడానికి, మీరు చాట్‌బాక్స్‌లో కుడివైపు ఎగువన ఉన్న మూడు చుక్కల మెను పై నొక్కాలి. ఆ తర్వాత మీరు మరిన్ని ఎంపిక పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు రిపోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.