- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతి తక్కువ ధరకే కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. Samsung, Motorola కంటే చౌకగా ఉంటుందా ?
దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ భారతదేశంలో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌ను విడుదల చేయబోతోంది. భారతీయ ఫోన్ మార్కెట్లో ఇది ఒక ముఖ్యమైన అడుగు. భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన Infinix, అక్టోబర్ 17, 2024న భారతదేశంలో జీరో ఫ్లిప్‌ను ప్రారంభించనుంది. రాబోయే ఫోల్డబుల్ ఫోన్ Samsung, Motorola వంటి పెద్ద కంపెనీల ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడనుంది.
ఇటీవలే ప్రారంభించిన మొదటి టాబ్లెట్ Infinix XPad తర్వాత, Infinix ఇప్పుడు Zero Flipని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇన్ఫినిక్స్ ఇండియా వెబ్‌సైట్‌లో జీరో ఫ్లిప్ కోసం ఒక ప్రత్యేక వెబ్‌పేజీ ఇప్పటికే సృష్టించారు. ఆ ఫోన్ రూపకల్పన, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు వెల్లడించారు.
Infinix జీరో ఫ్లిప్.. ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు..
Infinix Zero Flip ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించారు. దీంతో ఈ ఫోన్ భారతదేశంలో ఎలాంటి స్పెసిఫికేషన్లతో రాగలదో అంచనా వేయవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ ఇండియన్ మోడల్ ఫీచర్లను వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ 3.64 - అంగుళాల కవర్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9 - అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లేతో రావచ్చు.
Infinix జీరో ఫ్లిప్.. చిప్‌సెట్, కెమెరా..
ఇది MediaTek డైమెన్షన్ 8020 చిప్‌సెట్ మద్దతును పొందవచ్చు. ఫోన్ డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌లో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాను అందించవచ్చు. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి 32MP కెమెరా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
అంతే కాదు Infinix జీరో ఫ్లిప్‌లో 4,720mAh బ్యాటరీని ఇవ్వవచ్చు. ఇది 70W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇందులో రెండు రంగులు ఉన్నాయి. బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్.
Infinix జీరో ఫ్లిప్ ధర..
Infinix Zero Flip గ్లోబల్ వేరియంట్ ధర $600. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ. 50,418. Infinix ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీని కొనసాగిస్తుందని, Samsung, Galaxy Z ఫ్లిప్ సిరీస్, Motorola, Razr మోడల్ వంటి పోటీదారులను సవాల్ చేస్తుందని భావిస్తున్నారు.
భారతదేశంలో దీని ధర అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ రాబోయే ఫోల్డబుల్ ఫోన్ ధర అక్టోబర్ 17న లాంచ్ సందర్భంగా వెల్లడి కానుంది. సామ్‌సంగ్, మోటరోలా ఫోల్డబుల్ ఫోన్‌ల కంటే ఈ ఫోన్ చౌకైనదా లేదా ఖరీదైనదా అని అప్పుడు మీకే తెలుస్తుంది.