Smartwatches: అమెజాన్‌‌లో స్మార్ట్‌వాచ్‌లపై 75% డిస్కౌంట్

by Harish |   ( Updated:2024-09-29 16:27:32.0  )
Smartwatches: అమెజాన్‌‌లో స్మార్ట్‌వాచ్‌లపై 75% డిస్కౌంట్
X

దిశ, టెక్నాలజీ: పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను నిర్వహిస్తుండగా, దీనిలో అన్ని విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఇస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌లపై దాదాపు 75 శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తుంది. ఈ సేల్‌లో Apple, Samsung, OnePlus వంటి టాప్ కంపెనీలకు చెందిన హైఎండ్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌వాచ్‌లపై తగ్గింపు పొందవచ్చు. ఫిట్‌నెస్ ట్రాకింగ్, వివిధ రకాల స్మార్ట్ ఫీచర్‌లను అందించే స్మార్ట్‌వాచ్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

Samsung Galaxy Watch4 క్లాసిక్ LTE స్మార్ట్‌వాచ్ 1.81 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. సాధారణ రోజుల్లో దీని అసలు ధర రూ.42,999 కాగా, ఇప్పుడు ఇది రూ.9,999 లకే లభిస్తుంది. యాపిల్ వాచ్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ.89,900 కాగా, ఈ సేల్‌లో రూ.73,299 కే సొంతం చేసుకోవచ్చు. 1.43 అంగుళాల డిస్‌ప్లే కలిగిన OnePlus Watch 2 ను రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు, సాధారణ రోజుల్లో దీని అసలు ధర రూ.27,999.

Advertisement

Next Story

Most Viewed