- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేఎన్టీయూలో అట్టహాసంగా టెక్ ఫెస్ట్
దిశ, మేడ్చల్: జేఎన్టీయూలో ఏటా నిర్వహించే సాంకేతిక ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్. శ్రీనివాస్ అధ్యక్షతన ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాంపస్ విద్యార్థులతో పాటు దేశం నలుమూలల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన వర్సిటీ రిజిస్ట్రార్ గోవర్ధన్, నెట్ క్రాకర్ ఇండియా హెడ్ ఫణీంద్ర మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో రోజురోజుకీ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకోవడంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని సూచించారు. అందుకు ఇలాంటి సాంకేతిక ఉత్సవాలు ఎంతగానో ఉపకరిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
tag: Tech Fest, JNTU, kukatpalli